యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!
- March 24, 2026
యూఏఈ: యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నివాసితులను హెచ్చరించింది. ట్రాఫిక్ చట్టాలను పాటించాలని మరియు చెరువులు, వాగులకు దూరంగా ఉండాలని నివాసితులను అధికారులు కోరారు. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మధ్యస్థ గాలులు వీస్తాయని, అప్పుడప్పుడు బలమైన గాలులు వల్ల దుమ్ము తుఫానులు, ఇసుక కారణంగా విజిబిలిటీ తగ్గుతుందని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా, అస్థిరమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పబ్లిక్ పార్కింగ్ ఫీజు మినహాయింపును తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పొడిగిస్తున్నట్లు షార్జా ప్రకటించింది.
అబుదాబిలో తగ్గిన స్పీడ్ లిమిట్స్
అబుదాబిలోని అధికారులు కీలక రహదారులపై వేగ పరిమితులను తగ్గించారు. వాహనదారులను జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో డ్రైవర్లు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్వీహాన్ రోడ్డు (అల్ ఫయా వంతెన - నహిల్ వంతెన) పై గంటకు 100 కి.మీ. కు తగ్గించారు.
అల్ తాఫ్ రోడ్డు (అల్ సాద్ - స్వీహాన్), అల్ ఐన్ రోడ్డు (అల్ ఖజ్నా - రిమా) పై గంటకు 100 కి.మీ. వేగ పరిమితిని నిర్ణయించారు.
అల్ ఖలీజ్ అల్ అరబీ రోడ్డు (అల్ ఖలీజ్ అల్ అరబీ పార్క్ - ఎయిర్‌పోర్ట్ స్ట్రీట్) పై గంటకు 60 కి.మీ. వేగ తగ్గింపు వ్యవస్థను ప్రారంభించారు.
షేక్. జాయెద్ బిన్ సుల్తాన్ రోడ్ (ఖసర్ అల్ బహర్ - షేక్ జాయెద్ బ్రిడ్జ్), అబుదాబి - అల్ ఐన్ రోడ్ (అల్ నహ్దా బ్రిడ్జ్ - అల్ మఫ్రాక్ బ్రిడ్జ్) పై వేగ పరిమితిని గంటకు 100 కిలోమీటర్లకు తగ్గించారు.
ఎల్లో, ఆరేంజ్ అలెర్టులు
మరోవైపు, ఉష్ణోగ్రతలు 29°C వరకు ఉండవచ్చని పేర్కొన్నారు. అబుదాబిలో ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు, దుబాయ్‌లో 27 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా వర్షం, ధూళి కారణంగా ఎల్లో, ఆరేంజ్ హెచ్చరికలను జారీ చేశారు.
అబుదాబి, దుబాయ్‌లలో ఉష్ణోగ్రతలు 19డిగ్రీల వరకు, పర్వత ప్రాంతాలలో 12 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉంది. అబుదాబిలో గాలిలో తేమ శాతం 45 నుండి 90 వరకు, దుబాయ్‌లో 40 నుండి 80 వరకు ఉంటుంది. అరేబియా గల్ఫ్, ఒమన్ సముద్రంలో వాతావరణ పరిస్థితులు తేలికపాటి నుండి మధ్యస్థంగా ఉంటాయి. అప్పుడప్పుడు పెద్ద అలలు వచ్చే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







