నిరుద్యోగ యువతకు అలర్ట్..
- March 24, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. మార్చి 28న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు ఓయూ ఎంప్లాయిమెంట్ బ్యూరో ప్రకటించింది. ‘భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఫాబ్ సిటీ, రంగారెడ్డి)’ సహకారంతో ఈ నెల 28న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు ఓయూ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 28, 2026 శనివారం ఉదయం 11:00 గంటలకు ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయం, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా, ఓయూలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.
మార్చి 28న నిర్వహించే జాబ్ మేళా ద్వారా ఒకేసారి 100 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. బీటెక్ (EEE, ECE), డిప్లొమా (EEE, ECE) ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. 18-35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 28 శనివారం ఉదయం 11 గంటల వరకు ఓయూ క్యాంపస్‌కు రావాల్సి ఉంటుంది. అభ్యర్థులు వచ్చేటప్పుడు.. వారి వెంట విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాల్సిందిగా సూచించారు. మార్చి 28న ఉదయం అభ్యర్థులు నేరుగా ఓయూలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో (UEI&GB/MCC) కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం హెచ్.ఆర్ (HR) స్పందన రెడ్డిని 9100877349 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







