టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- March 24, 2026
అంకారా: టర్కీ లో బహ్రెయిన్ రాయబారి బస్సామ్ అహ్మద్ మర్జూక్ నేతృత్వంలోGCC సభ్య దేశాలు మరియు జోర్డాన్ రాయబారులు.. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిడాన్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. GCC సభ్య దేశాలు మరియు జోర్డాన్‌పై ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు, ప్రాంతీయ పరిణామాలపై చర్చించేందుకు వారు సమావేశమయ్యారని అధికారులు తెలిపారు.
GCC సభ్య దేశాల భద్రత అనేది ఒక సమగ్రమైన మరియు విడదీయరాని వ్యవస్థ అని రాయబారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పౌర సదుపాయాలు, సేవా కేంద్రాలు మరియు నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కొనసాగిస్తున్న దాడులపై సమీక్షించారు. ఈ దాడుల ఫలితంగా ప్రాణనష్టం సంభవించడంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని బస్సామ్ అహ్మద్ మర్జూక్ డిమాండ్ చేశారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రాంతీయ భద్రతను పెంపొందించే క్రమంలో ఉమ్మడి సహకారం ఎంత ముఖ్యమో ఆయన వివరించినట్లు బహ్రెయిన్ రాయబార కార్యాలయం తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







