వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- March 26, 2026
మనామాః ఆన్ లైన్ లో ఫోన్లను అందజేస్తానని మోసాలకు పాల్పడిన 53 ఏళ్ల వ్యక్తిని దక్షిణ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
నిందితుడు మొబైల్ ఫోన్లను వాయిదాల పద్ధతిలో విక్రయించి, వినియోగదారులతో ఒప్పందాలపై సంతకాలు చేయించుకునేవాడు. ఆ తర్వాత అతను వివరాలను తప్పుగా నమోదు చేసి, ఫోన్ల అసలు విలువ కంటే ఎక్కువ మొత్తాలను చూపించి ఆ ఒప్పందాలను మార్చేవాడని అధికారులు తెలిపారు.
అతనిపై ఫిర్యాదులు అందిన వెంటనే, డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించిందని, సరైన ఆధారాలు సేకరించి, నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఈ కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







