కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్‌వర్క్ బస్ట్..!!
- March 26, 2026
కువైట్: కువైట్ సింబల్స్, సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకున్న ఒక ఉగ్రవాద కుట్రను స్టేట్ భద్రతా యంత్రాంగం విజయవంతంగా భగ్నం చేసిందని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది దేశ జాతీయ భద్రతకు, స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు అని అధికారులు అభివర్ణించారు.
ఐదుగురు కువైట్ పౌరులు, గతంలో పౌరసత్వం రద్దు చేయబడిన ఒక కువైట్ యేతర వ్యక్తితో కూడిన నెట్‌వర్క్‌ను భద్రతా దళాలు అరెస్టు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశం విడిచి పారిపోయిన మరో 14 మంది అనుమానితులను కూడా అధికారులు గుర్తించారు. వీరిలో ఐదుగురు కువైట్ జాతీయులు, పౌరసత్వం రద్దు చేయబడిన ఐదుగురు వ్యక్తులు, ఇద్దరు ఇరానియన్లు, ఇద్దరు లెబనీస్ జాతీయులు ఉన్నారని పేర్కొంది.
నిషేధిత సంస్థ అయిన హిజ్బుల్లాతో ఈ నెట్‌వర్క్‌కు సంబంధాలు కలిగి ఉన్నాయని దర్యాప్తులో నిర్ధారణ అయిందన్నారు. మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ బృందం దేశంలోని ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుందని,ఇందుకు చాలా చురుకుగా ప్రణాళికలు రచిస్తోందన్నారు.
గూఢచర్యం, ఉగ్రవాద సంస్థలో చేరడం, జాతీయ నాయకత్వంపై దాడులకు సిద్ధమవడం వంటి ఆరోపణలను నిందితులు అంగీకరించినట్లు తెలిపింది. వారు విదేశాలలో ఈ బృందంలోని సభ్యుల చేత నిర్వహించబడిన ఉన్నత స్థాయి సైనిక శిక్షణ పొందినట్లు కూడా ఒప్పుకున్నారు. ఈ శిక్షణలో ఆయుధాల వాడకం, పేలుడు పదార్థాల వినియోగం, నిఘా పద్ధతులు మరియు హత్యాయత్న పద్ధతులు నేర్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ చర్యలను మంత్రిత్వ శాఖ "తీవ్రమైన ద్రోహం"గా మరియు జాతీయ విధేయతను స్పష్టంగా ఉల్లంఘించడంగా అభివర్ణించింది. ఇటువంటి చర్యలు కువైట్ దేశానికి వ్యతిరేకంగా చేసే దేశద్రోహం కిందకు వస్తాయని స్పష్టం చేసింది.
అరెస్టు అయిన వారందరినీ చట్టపరమైన విచారణల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు. కువైట్ సార్వభౌమత్వం మరియు స్థిరత్వం ఒక 'రెడ్ లైన్' గానే ఉంటాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నట్లు లేదా వాటికి మద్దతు ఇస్తున్నట్లు తేలిన ఎవరిపైనైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







