గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- March 27, 2026
మనామా: ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి మరియు సఫ్లై చైన్ లపై దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి జీసీసీ సభ్య దేశాల ధృష్టి సారించాయి. ఈ క్రమంలో రవాణా మరియు సమాచార శాఖ మంత్రులు వర్చువల్ సమావేశం నిర్వహించినట్లు గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సెక్రటరీ-జనరల్ జాసిమ్ మహమ్మద్ అల్-బుదైవి తెలిపారు.
బహ్రెయిన్ రవాణా మరియు సమాచార శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ల్యాండ్ బార్డర్ క్రాసింగ్‌ల సంసిద్ధత మరియు కార్యాచరణ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
గూడ్స్ రవాణాను సులభతరం చేయడానికి "గ్రీన్ లేన్స్" ప్రోటోకాల్‌ను యాక్టివేట్ చేయడంపై మంత్రులు చర్చించినట్లు తెలిపారు. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా పోర్టులు మరియు సురక్షిత రవాణా మార్గాలపై కూడా సమీక్షించినట్లు పేర్కొన్నారు. రియల్ టైమ్ పర్యవేక్షణ మరియు వేగవంతమైన రెస్పాన్స్ అందించడానికి ఉమ్మడిగా సమన్వయ యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారని తెలిపారు.
గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలలో ఆర్థిక భద్రతకు రవాణా రంగం కీలకం అని అల్-బుదైవి పేర్కొన్నారు. ఇది ల్యాండ్, వాయు, సముద్ర మార్గాల ద్వారా ఆహారం, మందులు, ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల నిరంతర ప్రవాహాన్ని నిర్ధారిస్తుందని, సవాలుతో కూడిన సమయాల్లో కూడా మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుతుందని ఆయన వెల్లడించారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రాంతం ప్రస్తుతం తీవ్రమవుతున్న సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితి GCC తన ఆర్థిక విజయాలను కాపాడుకోవడానికి మరియు కీలక రంగాల కొనసాగింపు సామర్థ్యానికి ఒక ముఖ్యమైన పరీక్ష అని ఆయన వివరించారు.
సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి 35కు పైగా సమన్వయ సమావేశాలు జరిగాయని, ఇది సభ్య దేశాల మధ్య ఉన్నత స్థాయి సంసిద్ధత మరియు పరస్పర అవగాహనను ప్రతిబింబిస్తుందని సెక్రటరీ-జనరల్ తెలిపారు. GCC అంతటా సఫ్లై చైన్ లు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించడానికి ల్యాండ్, సముద్ర, వాయు రవాణా సజావుగా సాగేలా చూడటం ఇకపై ఐచ్ఛికం కాదని, అది ఒక వ్యూహాత్మక అవసరమని సమావేశంలో ఎకగ్రీవంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్









