ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- March 27, 2026
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పై అమెరికా చర్యలకు నాటో మద్దతు ప్రకటించింది.
నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ, ఇరాన్ పై అమెరికా తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలు ఐరోపా భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల డొనాల్డ్ ట్రంప్ నాటో తమకు మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యల తర్వాతే మార్క్ రుట్టే స్పందిస్తూ నాటో వైఖరిని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంలో నాటో ఇప్పటికే భద్రతా చర్యలు చేపడుతోంది. హార్మూజ్ జలసంధిలో నౌకల భద్రత, క్షిపణి ముప్పులను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి







