ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- March 27, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ అభ్యర్థన మేరకు ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల ట్రంప్ హర్మూజ్ జలసంధి తెరవాలని అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఇరాన్‌తో చర్చలు ప్రారంభమయ్యాయి. మొదట 5 రోజుల గడువు ఇవ్వగా, ఇప్పుడు మరింతగా పొడిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే, అమెరికా ప్రాంతంలో సైనిక బలగాలను పెంచుతోంది. ఇరాన్ మాత్రం నేరుగా చర్చల్లో పాల్గొనడం లేదని చెబుతోంది. ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
తాజా వార్తలు
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము







