జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- March 27, 2026
న్యూ ఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో లూలూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ఫాలీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీసీసీ దేశాలకు ఆహార ఉత్పత్తుల సరఫరాలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను వివరించారు. ప్రస్తుత క్లిష్ట సమయాల్లో ఈ సరఫరాను కొనసాగించడానికి చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి తెలియజేశారు.
న్యూఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో గల్ఫ్ ప్రాంతమంతటా నిత్యావసర ఆహార పదార్థాల లభ్యతను కొనసాగించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై గురించి వివరించారు. జీసీసీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులు నివసిస్తున్నారని, వారికి భారతీయ ఆహార ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుందన్నారు.
యూసుఫ్ఫాలీ తన GCC మార్కెట్లలో ఆహార భద్రతకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో లూలూ గ్రూప్ చేపట్టిన ఇటీవలి కార్యక్రమాల గురించి ప్రధానమంత్రికి వివరించారు. ఈ గ్రూప్, భారతదేశంలోని పలు ప్రాంతాల నుండి ప్రత్యేక చార్టర్డ్ విమానాలు, కార్గో నౌకలు మరియు సాధారణ షిప్పింగ్ ద్వారా ఇప్పటివరకు 15,000 టన్నులు ఫుడ్ ప్రొడక్టులను తరలించినట్లు తెలిపారు.
గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలకు భారత్ ఒక కీలక వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. భారతీయ వ్యవసాయ, ఆహార ఉత్పత్తులను ప్రవాసులు, స్థానిక ప్రజలు ఇద్దరూ విస్తృతంగా వినియోగిస్తున్నారు.
అలాగే, కొనసాగుతున్న డిమాండ్‌కు మద్దతుగా అదనపు చార్టర్డ్ విమానాలు, కార్గో రవాణాలను షెడ్యూల్ చేసామని, రాబోయే వారాల్లో కూడా ఈ సరఫరా కార్యక్రమాలను కొనసాగించే ప్రణాళికలను యూసుఫలీ వివరించారు. గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతికి వీలు కల్పించేందుకు భారత ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!









