ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- March 27, 2026
ఇబ్రి: అల్ ధాహిరా గవర్నరేట్‌లోని ఇబ్రి విలాయత్‌లో ఒక వాడీలో వాటర్ పూల్ లో నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మరణించినట్లు సెర్చ్ అండ్ రెస్క్యూ సెక్టార్ నివేదించింది. బాధితుల్లో ఒకరు నీటిలోకి దిగి మునగగా, రెండవ మహిళ ఆమెను రక్షించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ఇద్దరూ నీటి ఉధృతికి చిక్కుకుని మునిగిపోయారని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు, మృతదేహాలను వెలికితీశాయి. ఒమన్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల వాడీలు మరియు లోతట్టు ప్రాంతాలలో నీటి మడుగులు ఏర్పడి, ఇలాంటి ప్రమాదాల ముప్పు ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్









