యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!

- March 27, 2026 , by Maagulf
యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!

యూఏఈః యూఏఈలో వర్షాలు కొనాసాగుతున్నాయి. పశ్చిమ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న ఒక ప్రధాన వాతావరణ వ్యవస్థ ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం అబుదాబి, దుబాయ్,  అల్ ఐన్, ఉత్తర తీరప్రాంతాలు మరియు దక్షిణ అంతర్గత ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

కొన్నిసార్లు గాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. దీని కారణంగా దుమ్ము తుఫానులు సంభవిస్తాయని పేర్కొంది. అరేబియా గల్ఫ్ మరియు ఒమన్ సముద్రంలో సముద్రం అలల తీవ్రత క్రమంగా పెరుగుతుందని తెలిపింది. ఈ క్రమంలో దుబాయ్ మరియు షార్జాలలో గరిష్ట ఉష్ణోగ్రత 25°Cగా ఉంటుందని పేర్కొంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com