భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- March 27, 2026
హైదరాబాద్: శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ శుక్రవారం సీతారాం బాగ్ పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో జరగనున్న శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు.
ఈ యాత్ర ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీతారాం బాగ్ ఆలయం నుంచి ప్రారంభమై, రాత్రి 10 గంటల కల్లా ముగిసేలా పక్కా రూట్ మ్యాన్ సిద్ధం చేశామని తెలిపారు.
ఇప్పటికే పలు శాఖల అధికారులతో కలిసి యాత్ర సాగే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.
ఈ భారీ శోభాయాత్ర కోసం దాదాపు 3 వేల మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అంతకు ముందు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి ఆయన శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్









