ఓటీటీలో హెబ్బా పటేల్ కొత్త సినిమా
- March 27, 2026
హాట్ బ్యూటీ హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రేపు ఉదయం 10 గంటలకు’. ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో, కేవలం పది రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ‘ఓ పిట్ట కథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
గతంలో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో అలరించిన హెబ్బా- చైతన్య జోడీ, ఈసారి థ్రిల్లర్ జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని నిర్మించిన ఈ సినిమాలో అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. కథపరంగా ఆసక్తిని కలిగించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ వాచ్‌గా ఇది నిలుస్తుంది. మరి థియేటర్స్ లో ప్లాప్ అయిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







