ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!

- March 29, 2026 , by Maagulf
ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!

మస్కట్: ఒమన్ లో భారీ వర్షాల కారణంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఈ సందర్భంగా మొత్తం 44 వైమానిక అత్యవసర రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీ తెలిపింది.

వీటిలో రాయల్ ఒమన్ పోలీస్ ఎయిర్ వింగ్ ద్వారా 38, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ ద్వారా 6 ఉన్నాయని, మొత్తంగా 58 రెస్క్యూ ఆపరేషన్లు మరియు 6 ఎమర్జెన్సీ మెడికల్  తరలింపులు నిర్వహించినట్లు పేర్కొన్నది.

సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ 254 రిపోర్డులకు స్పందించాయని, ఈ సమయంలో 404 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది.  ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మధ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com