కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి
- March 30, 2026
కువైట్ సిటీ: కువైట్లోని ఓ నీటి శుద్ధీకరణ కేంద్రం పై జరిగిన దాడిలో భారతీయ కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో తమిళనాడుకు చెందిన సంతానసెల్వం క్రిష్ణన్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కువైట్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపింది.
భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొంది. అలాగే బాధితుడి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కువైట్ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నామని ఎంబసీ స్పష్టం చేసింది.
ఈ దాడి ఎలా జరిగింది, దానికి కారణాలు ఏమిటి అనే అంశాలపై కువైట్ భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మృతుడి కుటుంబానికి వీలైనంత త్వరగా సమాచారం అందించి, అవసరమైన దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు భారత మిషన్ వెల్లడించింది.
Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on a desalination facility in Kuwait yesterday. The Embassy is closely coordinating with the Kuwaiti authorities to render all possible support and assistance.
— India in Kuwait (@indembkwt) March 30, 2026
తాజా వార్తలు
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి
- NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మయామి ఓపెన్ విజేతగా జానిక్ సినర్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!









