దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!

- March 31, 2026 , by Maagulf
దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!

కువైట్: కువైట్ ముడి ఆయిల్ సూపర్ ట్యాంకర్ “అల్-సల్మీ”పై మార్చి 31తెల్లవారుజామున ఇరాన్ దురుద్దేశపూర్వకంగా దాడి చేసిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ప్రకటించింది.  యూఏఈలోని దుబాయ్ పోర్టులో ఈ నౌక నిలిపిఉన్న సమయంలో తెల్లవారుజామున 12:10 గంటలకు ఈ సంఘటన జరిగిందని పేర్కొంది.

దాడి జరిగిన సమయంలో ట్యాంకర్ పూర్తిగా సరుకుతో నిండి ఉందని KPC తెలిపింది.  ఈ దాడి కారణంగా షిప్ బయటి భాగానికి  నష్టం వాటిల్లడంతో పాటు, షిప్ లోపల మంటలు చెలరేగాయని పేర్కొంది. దీంతో ఆయిల్ ట్యాంకర్ చుట్టుపక్కల జలాల్లో చమురు లీకేజీ అయ్యే ప్రమాదంపై ఆందోళనలు ఉన్నాయని తెలిపింది.

అత్యవసర సహాయక బృందాలు ప్రస్తుతం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంటలను అదుపులోకి తెచ్చి, ఆర్పివేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ దాడి ఫలితంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కార్పొరేషన్ వెల్లడించింది. ఆయిల్ ట్యాంకర్ ను కాపాడటానికి మరియు పర్యావరణ ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన చర్యలతో పాటు జరిగిన నష్టంపై విచారణ జరుగుతోందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com