కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!

- April 01, 2026 , by Maagulf
కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!

కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పై బుధవారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగిందని, ఈ దాడిని ఇరాన్ మరియు దాని అనుబంధ సాయుధ బృందాలు జరిపినట్లు అనుమానాలు ఉన్నాయని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ వెల్లడించింది.

కువైట్ ఏవియేషన్ ఫ్యూయలింగ్ కంపెనీ నిర్వహిస్తున్న ఇంధన నిల్వ ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని, దీంతో ఆ ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజీ తెలిపారు.

అత్యవసర సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశాయి.ఈ ఘటనలో ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఎవరూ గాయపడిన ఘటనలు నమోదు కాలేదని వెల్లడించారు. 

కీలకమైన మౌలిక సదుపాయాలను పరిరక్షించడానికి మరియు విమానాశ్రయ కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి అధికారులు క్షత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com