ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- April 03, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.నగరవ్యాప్తంగా గతంలో అమర్చిన సీసీ కెమెరాల్లో చాలా భాగాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ భద్రతకు ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియను ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ ప్రారంభించారు. దశలవారీగా కెమెరాలను తొలగించి వాటి స్థానంలో సురక్షితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఢిల్లీలో రెండు దశల్లో మొత్తం 2 లక్షలకుపైగా సీసీ కెమెరాలు అమర్చారు. మొదటి దశలో అమర్చిన కెమెరాలు ఎక్కువగా చైనా కంపెనీ హైక్‌విజన్ కు చెందినవిగా ఉన్నాయి. ఈ కంపెనీ కెమెరాలపై ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంబంధిత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన సమాచారాన్ని ఇతర దేశాలకు చేరే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ కెమెరాలను తొలగించి వాటి స్థానంలో స్వదేశీ లేదా భద్రతా ప్రమాణాలు ఉన్న పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







