రియో ఒలింపిక్స్ విలేజ్లో బుధవారం మరో చోరీ ...
- August 04, 2016
రియో ఒలింపిక్స్ విలేజ్లో బుధవారం మరో చోరీ జరిగింది. తమ వస్తువులు దొంగతనానికి గురయ్యాయని డానిష్ అథ్లెట్లు చెప్పడంతో నిర్వాహకులు వారికి బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. మొబైళ్లు, వస్త్రాలు, ఐపాడ్ కనిపించడం లేవని డెన్మార్క్ చెఫ్ డి మిషన్ మార్టెన్ రాడ్ట్విట్ టీవీ2 మీడియాతో పేర్కొన్నారు.ఒలింపిక్ విలేజ్లోని 36 భవంతుల్లో పలు సమస్యలపై డానిష్ ప్రతినిధులు జులై 18 నుంచి ఇప్పటివరకు దాదాపు 150 ఫిర్యాదులు చేశారు. మొబైళ్ల దగ్గర్నుంచి పక్కబట్టల వరకు చాలా పోయినట్లు తెలిపారు. గతంలోనూ ఆటగాళ్లు తమ వస్తువులు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
- సౌదీ అరేబియాలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- లుసైల్లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!
- యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!







