భారత్ అభిప్రాయాన్ని స్పష్టంగా విన్పించారు : రాజ్‌నాథ్ సింగ్
- August 04, 2016
పాకిస్థాన్‌లో జరుగుతున్న సార్క్ సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ అభిప్రాయాన్ని స్పష్టంగా విన్పించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థల పట్ల ఆయన పదునైన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థలపైనే కాకుండా వాటికి మద్దతిస్తున్న సంస్థలు, దేశాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ నుంచి భారత్‌లో దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. .అలాగే ఉగ్రవాదులను అమరవీరులుగా పేర్కొనడంపైనా రాజ్‌నాథ్ మండిపడ్డారు. ఉగ్రవాదులను అలా పొగడడం తగదన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో భద్రతాసిబ్బంది హతమార్చిన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వానిని పాకిస్థాన్ యోధుడిగా పేర్కొనడాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరు.. ఉగ్రవాదం అంటే ఉగ్రవాదమే అని రాజ్‌నాథ్ ఇస్లామాబాద్‌లో సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో అన్నారు.బుర్హాన్ వానిని మట్టుపెట్టిన అనంతరం కశ్మీర్లో కల్లోల పరిస్థితులు, భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజ్‌నాథ్ ప్రసంగాన్ని పాకిస్థాన్ అధికార పీటీవీలో ప్రసారం చెయ్యలేదు. అలాగే భారత మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. హిజ్బుల్, లష్కరే ఉగ్రవాద సంస్థలు పాక్‌లో రాజ్‌నాథ్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశాయి. పాక్ హోం మంత్రితో రాజ్‌నాథ్ కరచాలనం సార్క్ సమావేశానికి వచ్చిన మంత్రులను సమావేశం జరగనున్న సెరెనా హోటల్ వద్ద పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి నిసార్ అలీ ఖాన్ స్వాగతం పలికారు. ఆ సమయంలో రాజ్‌నాథ్ నిసార్తో కరచాలనం చేశారు. సార్క్ సమావేశానికి ముందు వీరిద్దరూ తొలిసారి అప్పుడే కలుసుకున్నారు. కేవలం మర్యాదపూర్వకంగా షేక్‌హ్యాండ్ ఇచ్చి రాజ్‌నాథ్ ముందుకు వెళ్లిపోయారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశాలు ఉండబోవని భారత్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







