మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- April 03, 2026
కువైట్: కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (KNPC) నిర్వహిస్తున్న మీనా అల్-అహ్మది రిఫైనరీపై శుక్రవారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంగణంలోని పలు ఆఫరేషనల్ యూనిట్స్ లో మంటలు చెలరేగాయని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ఒక ప్రకటనలో ప్రకటించింది. అత్యవసర మరియు అగ్నిమాపక బృందాలను వెంటనే రంగంలోకి దించినట్లు KPC తెలిపింది. ప్రత్యేక బృందాలు మంటలను అదుపులోకి తీసుకురావడానికి మరియు అవి రిఫైనరీలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడానికి సమర్థవంతంగా పనిచేశాయని తెలిపింది.ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని కార్పొరేషన్ ధృవీకరించింది.
కార్మికుల భద్రతను నిర్ధారించడానికి మరియు ప్రాంగణాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కూడా పేర్కొంది. రిఫైనరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు పర్యావరణ ప్రజా ప్రాధికార సంస్థతో సమన్వయం చేసుకుంటున్నట్లు కేపీసీ పేర్కొంది. ఈ ఘటన ఫలితంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రతికూల పర్యావరణ ఘటన నెలకొనలేదని తెలిపింది.
నిరంతరాయ కార్యకలాపాలు కొనసాగేలా.. ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







