ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- April 03, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. వేసవి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 42°C నుండి 43°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
గురువారం నమోదైన గణాంకాల ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాంలో అత్యధికంగా 40.6°C ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, చిత్తూరు జిల్లా నిండ్రలో 40°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది:
శుక్రవారం (ఏప్రిల్ 3): రాష్ట్రవ్యాప్తంగా 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
శనివారం (ఏప్రిల్ 4): 41 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా.
ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిదని తెలిపారు. సరిపడా నీరు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







