ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- April 03, 2026
దోహా: ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) ఉన్న విద్యార్థులకు సమ్మిళిత విద్య(inclusive education)ను ప్రోత్సహించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
ఏప్రిల్ 2న ఆటిజం డే సందర్భంగా ఖతార్‌లోని ప్రభుత్వ పాఠశాలలు మరియు కిండర్‌గార్టెన్‌లలో ప్రస్తుతం 993 మంది ఆటిజం ఉన్న విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇది దేశవ్యాప్తంగా ఇంక్లూసీవ్ విద్యా సేవలపై పెరుగుతున్న దృష్టిని ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
విద్యార్థులకు సరైన విద్యా మార్గాలను పొందేలా చూసేందుకు, ప్రధాన ఇంక్లూసీవ్ పాఠశాలలతో పాటు అల్ హిదాయా పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్‌లతో సహా ప్రత్యేక సంస్థల ద్వారా కూడా మద్దతు ఇవ్వబడుతుందని పేర్కొంది.
హమద్ మెడికల్ కార్పొరేషన్‌తో కలిసి ఇంక్లూసీవ్ విద్యను విస్తరించడానికి, తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడానికి ఇష్టపడే తల్లిదండ్రుల కోసం మంత్రిత్వ శాఖ విద్యా వోచర్లను అందిస్తోంది.
అలాగే, కమ్యూనికేషన్, ప్రవర్తన మరియు క్రమబద్ధమైన లెర్నింగ్ ను మెరుగుపరచడానికి రూపొందించిన అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ (ABA), పిక్చర్ ఎక్స్ఛేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ (PECS) మరియు TEACCH విధానం వంటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు విద్యామంత్రిత్వశాఖ వెల్లడించింది.
>స్పీచ్ మరియు లాంగ్వేజ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ మరియు ఫిజియోథెరపీతో సహా అనేక రకాల సహాయక సేవలు కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. ఇల్లు మరియు పాఠశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, విద్యార్థులకు సంపూర్ణ సహాయక వ్యవస్థను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, శిక్షణా వర్క్‌షాప్‌ల ద్వారా కుటుంబాలు సైతం ప్రయోజనం పొందుతున్నాయని
దీంతోపాటు ఆటిజం ఉన్న విద్యార్థులను పోటీలు, పాఠ్యేతర కార్యకలాపాలు, వార్షిక సాంకేతిక ప్రదర్శనలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఇది వారి సామాజిక భాగస్వామ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని తెలిపారు.
2007లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ 2వ తేదీని ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంగా (WAAD) ప్రకటించింది. అప్పటి నుండి ఆటిజం ఉన్న వ్యక్తుల మానవ హక్కులు మరియు ప్రాథమిక స్వేచ్ఛల పూర్తి సాకారాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









