ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!

- April 04, 2026 , by Maagulf
ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!

కువైట్ః ఒక విద్యుత్ ఉత్పాదన మరియు నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్  డ్రోన్ దాడి జరిగిందని, ఆ సదుపాయంలోని కొన్ని భాగాలకు నష్టం వాటిల్లిందని కువైట్ విద్యుత్, జల మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటన అనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి అత్యవసర మరియు సాంకేతిక బృందాలను వెంటనే రంగంలోకి దించినట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, ఇంజనీర్ ఫాతిమా అబ్బాస్ జవహర్ హయత్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. పుకార్లను వ్యాప్తి చేయవద్దని అన్నారు. తాజా సమాచారాన్ని అందించడంలో మంత్రిత్వ శాఖ పారదర్శకతకు కట్టుబడి ఉందని హయత్ పునరుద్ఘాటించారు.

ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి మరియు కీలకమైన సేవల నిరంతర సరఫరాను నిర్ధారించడానికి సాంకేతిక బృందాలు అత్యంత సమర్థవంతంగా నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com