గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- April 05, 2026
మనామా: ఇరాన్ డ్రోన్లతో తమ పలు ఆపరేషన్ యూనిట్లపై దాడులు చేసిందని గల్ఫ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ (GPIC) ప్రకటించింది.ఈ ఘటన వల్ల ప్రభావితమైన పలు యూనిట్లలో మంటలు చెలరేగాయని కంపెనీ పేర్కొంది. అయితే, అత్యవసర సహాయక బృందాలు వేగంగా స్పందించడంతో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని GPIC ధృవీకరించింది.
ప్లాంట్‌పై జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నష్ట అంచనా బృందాలను రంగంలోకి దించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, సైట్‌ను సురక్షితం చేయడానికి తమ అత్యవసర బృందాలు సివిల్ డిఫెన్స్ యూనిట్లు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో పనిచేశాయని కంపెనీ తెలిపింది. తమ సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యత అని GPIC స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









