చైనాలో బోయింగ్ 737 రెస్టారెంట్
- August 04, 2016
చైనాలో ఉహాన్ ప్రాంతానికి చెందిన లీ లియాంగ్ అనే వ్యాపార వేత్త బోయింగ్737 విమానాన్ని రెస్టారెంట్‌గా మార్చేశాడు. దేశంలో మొట్ట మొదటి విమాన రెస్టారెంట్ అయిన లిల్లీ ఎయిర్‌వేస్‌ని ఇటీవలే ప్రారంభించారు. ఇందులో విమానంలో కూర్చున్న అనుభూతినిచ్చే సిములేటర్, బయట పిల్లలు ఆడుకోవడానికి పలు రైడ్స్ కూడా ఏర్పాటు చేశారు.
ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ అయిన బటావియాఎయిర్ విమానయాన సంస్థ నుంచి 5 మిలియన్ యువాన్లు ఖర్చు పెట్టి విమానాన్ని కొనుగోలు చేసి చైనా తెప్పించాడు లియాంగ్. కస్టమ్స్ నియమాలన్నీ పాటించి అది చైనా చేరుకునేసరికి 6 నెలల కాలం పట్టిందట. ఇండోనేషియా నుంచి చైనా చేరుకునే క్రమంలో 8 సార్లు భాగాలుగా విడగొట్టి మళ్లీ అమర్చారట. భాగాలుగా విడగొట్టి 70 కంటైనర్లలో ఆ భాగాలను ఉంచి దఫ దఫాలుగా ఓడపై తీసుకురావడానికి మరో 3 మిలియన్ల యువాన్లు ఖర్చు చేశాడట. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఖరీదైన రెస్టారెంట్ల సరసన ఈ లిల్లీ ఎయిర్‌వేస్ రెస్టారెంట్ కూడా చేరింది.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







