ఒకే ఫోన్ కాల్‌తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- April 06, 2026
మనామా: ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఉద్యోగిగా నటిస్తూ ఫోన్ చేసిన వ్యక్తి, తన ఖాతా వివరాలను అప్డేట్ చేయమని కోరడంతో.. బహ్రెయిన్‌కు చెందిన ఒక మహిళ ఫోన్ స్కామ్‌కు గురై 1,030 బహ్రెయిన్ దినార్లను కోల్పోయింది.
ఆ కాల్ నిజమైనదని నమ్మి, ఆమె తన ఫోన్‌కు వచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను షేర్ చేసింది. దీంతో స్కామర్లు ఆమె ఖాతాలోకి ప్రవేశించి డబ్బును ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.
26 ఏళ్ల ఆసియా దేశస్థుడు, గుర్తు తెలియని మరో సహచరుడితో కలిసి, బాధితురాలి బ్యాంక్ కార్డ్ మరియు పేమెంట్ యాప్‌కు అనుసంధానించబడిన కోడ్‌ను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇక ట్రాన్స్ ఫర్ చేసుకున్న మొత్తంలో 1,000 బహ్రెయిన్ దినార్లు నిందితుడి ఖాతాకు బదిలీ కాగా, అదే రోజు విత్‌డ్రా చేసేశారు.నిందితుడు తన సొంత వివరాలతోనే ఖాతాను తెరిచాడని, ఆ తర్వాత మోసంలో తన ప్రమేయాన్ని అంగీకరించాడని అధికారులు వెల్లడించారు.
ఫోన్ ఆధారిత సైబర్ మోసాల ముప్పు పెరుగుతున్న విషయాన్నిఈ కేసు స్పష్టం చేస్తుందని పోలీసులు అన్నారు. ఈ కేసు ఇప్పుడు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టులో విచారణలో ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







