ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- April 06, 2026
తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు పై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు పనులు ఇప్పటికే ఊపందుకోగా, తాజాగా ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, జిల్లా అభివృద్ధి పై వరాల జల్లు కురిపించారు.
ఆదిలాబాద్ ప్రజల చిరకాల కోరికైన విమానాశ్రయ నిర్మాణంపై సీఎం సానుకూలంగా స్పందించారు. “కొత్త ఎయిర్‌పోర్టు అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చించాం. వీలైతే జూన్ 2వ తేదీ లోపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత నేను తీసుకుంటా” అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఎయిర్‌పోర్టుతో పాటు ఆదిలాబాద్ ప్రాంతాన్ని గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్‌కు మంజూరు చేసి ఇక్కడి ఆదివాసీలకు ఉపాధి మార్గాలు చూపిస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్‌కు కొత్త యూనివర్సిటీ ఇస్తాం. త్వరలోనే దాని ప్రారంభోత్సవం ఉంటుంది.’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







