సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!

- April 07, 2026 , by Maagulf
సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న \'అల్ థికా గ్రూప్\'..!!

కువైట్: కువైట్ కు చెందిన 'అల్ థికా గ్రూప్' సామాజిక మరియు మానవీయ బాధ్యత పట్ల తన నిబద్ధతను చాటుకున్నది. ఇటీవల ఇరాన్ డ్రోన్ దాడిలో మరణించిన ఎలక్ట్రీషియన్ సంతానశెల్వం కృష్ణన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. భారత్ లోని అతడి కుటుంబానికి ఏడాది పాటు వేతనాన్ని చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కువైట్‌లోని ఒక విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారంలో (desalination plant) పనిచేస్తున్న  సమయంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో కృష్ణన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబానికి అండగా నిలిచే లక్ష్యంతో చేపట్టిన ఈ సహాయ కార్యక్రమాన్ని అమలు చేయడానికి, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులన్నింటినీ పొందినట్లు కంపెనీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com