నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- April 07, 2026
మనామా: నకిలీ కరెన్సీ కలిగి ఉన్న 48 ఏళ్ల వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.అలాగే, BD500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సదరు వ్యక్తిపై మాదకద్రవ్యాలకు సంబంధించిన ఒక కేసు నమోదు అయిందని, అతడి నుంచి స్వాధీనం చేసుకున్న నగదులో నకిలీ 500 సౌదీ రియాల్ నోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో, కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా.. నిందితుడి పంపిణీ చేసే ఉద్దేశంతోనే ఆ నకిలీ 500 రియాల్ నోటును కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
నిందితుడిని 2025 ఆగస్టు 9న మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణపై 'డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం' అరెస్టు చేసిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆస్తుల అప్పగింత సమయంలో సదరు నకిలీ నోటు బయటపడిందన్నారు. BD30 చెల్లించి తెలియని ఒక వ్యక్తి నుండి ఆ నకిలీ నోటును తీసుకున్నట్లు నిందితుడు విచారణ సందర్భంగా వెల్లడించాడని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







