పాస్‌పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- April 07, 2026
దమ్మామ్: ప్రయాణికులకు వేగవంతమైన సేవలను అందించడానికి పాస్పోర్ట్స్ డైరెక్టరేట్.. తూర్పు ప్రావిన్స్‌లోని కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ వద్ద సిబ్బంది కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అత్యంత రద్దీగా ఉండే సరిహద్దు క్రాసింగ్లలో ఒకటైన కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ప్రక్రియలను వేగవంత చేసేందుకు వీలుగా ప్రవేశపెట్టిన స్మార్ట్ పరిష్కారాలలో ఈ చొరవ ఒక భాగమని పేర్కొన్నది. ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం, ముఖ్యంగా వృద్ధ ప్రయాణికులకు మరియు వికలాంగులకు సహాయపడుతుందని, వారి రాకపోకలను సులభతరం చేయడంతోపాటు సేవా నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు.
ఇది లేన్లు మరియు గేట్ల ద్వారా వాహనాల రాకపోకలను మెరుగ్గా నియంత్రించడానికి దోహదపడటంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా ప్రతిస్పందించేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు. సరిహద్దు కార్యకలాపాలను ఆధునీకరించేందుకు జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, సౌదీ అరేబియా అన్ని పోర్టులలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







