ఒమన్‌లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!

- April 07, 2026 , by Maagulf
ఒమన్‌లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!

మస్కట్: ఒమన్ వ్యాప్తంగా భద్రత మరియు సంసిద్ధతను పెంపొందించే ప్రయత్నాలలో భాగంగా అనుమానాస్పదంగా ఎగిరే వస్తువులను గమనిస్తే నివేదించాలని నివాసితులకు ప్రభుత్వ మీడియా కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆకాశంలో అసాధారణ వైమానిక కార్యకలాపాలను గుర్తించేందుకు కొన్ని ముఖ్య సూచికలను హైలైట్ చేసింది. వాటిలో పెద్ద లేదా అసాధారణ శబ్దాలు మరియు నెమ్మదిగా లేదా క్రమరహితంగా కదిలే వస్తువులు ఉన్నాయి. అటువంటి వాటిని గమనించిన వెంటనే ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళి, సంబంధిత అధికారులకు వాట్సాప్ నంబర్ 77720078 కు ఆ ప్రదేశం కచ్చితమైన వివరాలు మరియు వీడియో లేదా ఫోటోను షేర్ చేయాలని కోరింది.  ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని సూచించింది.

ప్రజలను వేగంగా కాపాడటంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తెలిపింది. సకాలంలో నివేదించడం వలన సంబంధిత అధికార యంత్రాంగం జరుగబోయే ప్రమాదాలను అంచనా వేయడానికి మరియు తగిన చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుందని పేర్కొంది.

ఈ ప్రకటన ముందుజాగ్రత్త చర్యలలో భాగమని,  భద్రతా నిఘాలో సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com