పాస్‌పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్‌వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!

- April 07, 2026 , by Maagulf
పాస్‌పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్‌వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!

దమ్మామ్: ప్రయాణికులకు వేగవంతమైన సేవలను అందించడానికి  పాస్‌పోర్ట్స్ డైరెక్టరేట్.. తూర్పు ప్రావిన్స్‌లోని కింగ్ ఫహద్ కాజ్‌వే క్రాసింగ్ వద్ద సిబ్బంది కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అత్యంత రద్దీగా ఉండే సరిహద్దు క్రాసింగ్‌లలో ఒకటైన కింగ్ ఫహద్ కాజ్‌వే వద్ద ప్రక్రియలను వేగవంత చేసేందుకు వీలుగా ప్రవేశపెట్టిన స్మార్ట్ పరిష్కారాలలో ఈ చొరవ ఒక భాగమని పేర్కొన్నది. ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం, ముఖ్యంగా వృద్ధ ప్రయాణికులకు మరియు వికలాంగులకు సహాయపడుతుందని, వారి రాకపోకలను సులభతరం చేయడంతోపాటు సేవా నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు.

 ఇది లేన్‌లు మరియు గేట్ల ద్వారా వాహనాల రాకపోకలను మెరుగ్గా నియంత్రించడానికి దోహదపడటంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా ప్రతిస్పందించేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు.  సరిహద్దు కార్యకలాపాలను ఆధునీకరించేందుకు జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, సౌదీ అరేబియా అన్ని పోర్టులలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోందని అథారిటీ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com