ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- April 08, 2026
టెహ్రాన్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. ఇరాన్‌పై విరుచుకుపడతామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండు వారాల పాటు దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఈ ‘స్మాల్ బ్రేక్’ సాధ్యమైంది. హర్మూజ్ జలసంధిని తెరవాలన్న ప్రధాన డిమాండ్‌తో అమెరికా ఈ గడువును పొడిగించింది.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, ఇరాన్‌లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని భారత ప్రభుత్వం బుధవారం అత్యవసర సలహా జారీ చేసింది. భారత రాయబార కార్యాలయం సూచించిన సురక్షిత మార్గాల ద్వారానే దేశం దాటాలని కోరింది.
ముఖ్య సూచనలు:
- రాయబార కార్యాలయంతో సంప్రదించకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదు.
- సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాలపై అంతస్తులకు దూరంగా ఉండాలి.
- అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లు: +989128109115; +989128109109; +989128109102; +989932179359.
- మెయిల్ ఐడి: [email protected].
చిక్కుకున్న 9 వేల మంది భారతీయులు
అధికారిక గణాంకాల ప్రకారం, యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్‌లో విద్యార్థులతో కలిపి సుమారు 9,000 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 1,800 మంది స్వదేశానికి చేరుకోగా, మిగిలిన వారిని సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలికంగా యుద్ధం ఆగిన ఈ రెండు వారాల సమయాన్ని భారతీయులను తరలించేందుకు అనుకూలంగా మార్చుకోవాలని కేంద్రం భావిస్తోంది.
⚠️ Advisory as on 08 April 2026. pic.twitter.com/pusFQIAKKI
— India in Iran (@India_in_Iran) April 8, 2026
తాజా వార్తలు
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..









