దక్షిణ భారత్‌లో తొలి డాప్లర్‌ వాతావరణ రాడార్‌ ప్రారంభించిన స్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్

- August 04, 2016 , by Maagulf
దక్షిణ భారత్‌లో తొలి డాప్లర్‌ వాతావరణ రాడార్‌ ప్రారంభించిన స్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్

తుపాన్లతోపాటు, ఇతర తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని అందించే డాప్లర్‌ రాడార్‌ను ప్రారంభించారు. గురువారమిక్కడి విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం(వీఎస్‌ఎస్‌సీ)లో ఇస్రో ఛైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ 'సి బ్యాండ్‌ పోలారిమెట్రిక్‌ డాప్లర్‌ వాతావరణ రాడార్‌'ను ప్రారంభించారు. ఈ రాడార్‌ నుంచి సమాచారం భారత వాతావరణ విభాగానికి అందుబాటులోకి వస్తుందని కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ తరహాలో దక్షిణ భారత్‌లో ఏర్పాటు చేసిన తొలి రాడార్‌ ఇదేనని వీఎస్‌ఎస్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్రో, బీహెచ్‌ఈఎల్‌ రూపొందించిన తొలి వాతావరణ రాడార్‌ను మేలో ప్రధాని నరేంద్రమోదీ మేఘాలయ చిరపుంజిలో ఆవిష్కరించారు. భుజ్‌, గోపాల్‌పూర్‌లలో ఏర్పాటు చేయనున్న మరో రెండు డాప్లర్‌ రాడార్‌లకు సంబంధించిన పనులు సాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com