ఐఎస్‌ వాళ్లమంటూ భారతీయ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి

- August 04, 2016 , by Maagulf
ఐఎస్‌ వాళ్లమంటూ భారతీయ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి

ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదివంటూ అమెరికాలో భారతీయ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ఒమాహా పట్టణంలోని భారతీయ రెస్టారెంట్‌లో సుతాహర్‌ సుబ్బురాజ్‌ అనే వంటమనిషి పనిచేస్తున్నారు. చెత్త బయటపడేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి సుబ్బురాజ్‌పై దాడి చేశాడు. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు దేశ విడిచివెళ్లిపోవాలంటూ అభ్యంతరకమైన మాటలతో తిట్టాడు. తల, ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. కాలితో తన్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఈ దాడిని హిందూ అమెరికా సంస్థలు తీవ్రంగా ఖండించాయి. దీన్ని జాతి వ్యతిరేక దాడిగా అభివర్ణించింది. దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల ప్రజలపై అనవసర భయాందోళనలు పెంచుకొని దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com