దక్షిణ భారత్‌లో తొలి డాప్లర్ వాతావరణ రాడార్ ప్రారంభించిన స్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్
- August 04, 2016
తుపాన్లతోపాటు, ఇతర తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని అందించే డాప్లర్ రాడార్‌ను ప్రారంభించారు. గురువారమిక్కడి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్ఎస్సీ)లో ఇస్రో ఛైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ 'సి బ్యాండ్ పోలారిమెట్రిక్ డాప్లర్ వాతావరణ రాడార్'ను ప్రారంభించారు. ఈ రాడార్ నుంచి సమాచారం భారత వాతావరణ విభాగానికి అందుబాటులోకి వస్తుందని కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ తరహాలో దక్షిణ భారత్‌లో ఏర్పాటు చేసిన తొలి రాడార్ ఇదేనని వీఎస్ఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్రో, బీహెచ్ఈఎల్ రూపొందించిన తొలి వాతావరణ రాడార్‌ను మేలో ప్రధాని నరేంద్రమోదీ మేఘాలయ చిరపుంజిలో ఆవిష్కరించారు. భుజ్, గోపాల్‌పూర్‌లలో ఏర్పాటు చేయనున్న మరో రెండు డాప్లర్ రాడార్లకు సంబంధించిన పనులు సాగుతున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







