సీజ్‌ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- April 10, 2026
ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సీజ్‌ఫైర్ కోసం ఇరాన్ 10 డిమాండ్లు చేయగా, అమెరికా 14 ప్రతిపాదనలు చేసింది.
సీజ్‌ఫైర్ ఒప్పందంలో భాగంగా ఇరాన్ కొన్ని కీలక షరతులు పెట్టింది. ఇరువైపులా దాడులు జరగకుండా హామీ ఇవ్వాలని, హార్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని గుర్తించాలని డిమాండ్ చేసింది. అలాగే అమెరికా పశ్చిమాసియాలోని సైనిక స్థావరాలను తగ్గించాలని కోరింది.
ఇరాన్ పై విధించిన అన్ని ఆంక్షలను తొలగించడం, విదేశాల్లో నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం వంటి అంశాలను కూడా ఇరాన్ ప్రస్తావించింది. ఈ షరతులు అంతర్జాతీయ చట్టాల కింద అమలు కావాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేయాలని కోరింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్‌కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్‌ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









