సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- April 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌లో ఇంధన, పెట్రోకెమికల్ కేంద్రాలు, మరియు కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
జీసీసీ అంతటా పౌర మరియు ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు కొనసాగింపుగా ఉన్నాయని, ఇవి ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించే తీవ్రమైన ఉద్రిక్తతగా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
ఇటువంటి దాడులు మంచి పొరుగు సంబంధాల సూత్రాలు, అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని తెలియజేసింది.
సౌదీ అరేబియాకు పూర్తి సంఘీభావం ఉంటుందని, దాని సార్వభౌమత్వం, భద్రత, మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకునే అన్ని చర్యలకు పూర్తి మద్దతు ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరాన్ దాడులను అరికట్టడానికి అంతర్జాతీయ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







