అజిత్-అధిక్ రవిచంద్రన్ కాంబో మళ్లీ షురూ

- April 10, 2026 , by Maagulf
అజిత్-అధిక్ రవిచంద్రన్ కాంబో మళ్లీ షురూ

కోలీవుడ్ స్టార్ హీరో, ‘థల’ అజిత్ కుమార్ తన తదుపరి చిత్రం #AK64 కోసం సిద్ధమవుతున్నారు. ప్యాషన్, ప్రొఫెషన్‌ను బ్యాలెన్స్ చేయడంలో అజిత్ రూటే వేరని ఈ సినిమా ప్లానింగ్ చూస్తుంటే అర్థమవుతోంది. రేసింగ్‌ పై తనకున్న మక్కువను ఏమాత్రం తగ్గించుకోకుండా ఆయన రూపొందించుకున్న ఈ కొత్త షెడ్యూల్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మరియు అజిత్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అజిత్ తన రెండు ప్యాషన్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఒక ప్రత్యేక ప్లానింగ్ చేశారు. నెలలో 15 రోజులు సినిమా షూటింగ్‌కు, మిగిలిన 15 రోజులు రేసింగ్‌కు కేటాయించబోతున్నారు. దీనివల్ల సినిమా నిర్మాణం కాస్త ఆలస్యమైనా, తన రేసింగ్ కెరీర్‌కు ఆటంకం కలగకూడదనేది ఆయన ఉద్దేశం.

అజిత్ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల మధ్య కొన్ని భేదాలు రావడంతో ఈ చిత్రాన్ని అజిత్ స్వయంగా నిర్మించాలని భావిస్తున్నారట. మరో నిర్మాణ సంస్థ కేవలం ఫండింగ్ సపోర్ట్ మాత్రమే అందిస్తుందని అజిత్ తన సొంత బ్యానర్‌పైనే ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని టాక్.

పారితోషికం కంటే సినిమా అవుట్‌పుట్ అలాగే తన రేసింగ్ కూడా అనుకూలంగా ఉండేలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.’గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమా తర్వాత అధిక్ రవిచంద్రన్ మళ్లీ అజిత్‌ను డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. అజిత్ కొత్త మేకోవర్ మరియు ఆయన రేసింగ్ పట్ల చూపిస్తున్న ఆసక్తి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com