శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- April 11, 2026
అమరావతి లో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ వ్యాపారవేత్తలకు వినతి
కొలంబో: సినీ సాంస్కృతిక పర్యాటక రంగాల్లో ఇచ్చిపుచ్చకునే ధోరణిలో ముందుకుసాగాలని, అప్పుడే ఇరుదేశాల సంబంధ బాంధవ్యాలు మరింత పటిష్టమవుతాయని శ్రీలంక రాజధాని కొలంబో లో పర్యటించిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా ప్రతినిధి బృందం అభిప్రాయపడింది.సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా , విజయ్ వర్మ పాకలపాటి లు అక్కడి ప్రజా ప్రతినిధులు, సినీ క్రీడా వ్యాపార ప్రముఖులను కలిసి పలు అంశాలపై చర్చించారు.శ్రీలంక మాజీ అధ్యక్షులు , ప్రధాన మంత్రి మహింద్ర రాజపక్స తనయుడు మాజీ మంత్రి, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు నమల్ రాజపక్స ,కొలంబో మేయర్ వ్రేయిల్ కాలీ బల్తాజార్, క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య, శ్రీలంక ఫిల్మ్ కార్పొరేషన్ అధికారులతో ఈ బృందం సమావేశం అయ్యింది. సినిమా రంగానికి సంబంధించి టెక్నాలజీ విషయం లో భారతీయ చలన చిత్ర పరిశ్రమ సహకారం తీసుకోవాలని, అలాగే ఆర్టిస్ట్ ఎక్స్ చేంజ్ జరగాలని, తద్వారా ఇరు దేశాల మార్కెట్ మరింత విస్తృతమవుతుందని , ఇరుదేశాల లొకేషన్ లలో షూటింగ్ లు జరిగేలా ఉభయ దేశాల చిత్ర పరిశ్రమలు చూసుకోవాలని తద్వారా పర్యాటక రంగం ఇరుదేశాలలో అభివృద్ధి చెందడమే కాక సాంస్కృతిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా విజ్ఞప్తి చేశారు. శ్రీలంక లో అగ్ర స్తానం లో వున్న వ్యాపార వేత్తలు విశ్వ రాజధానిగా తీర్చిదిద్దుకుంటున్న అమరావతి లో పెట్టుబడులు పెట్టాలని సంస్థ ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటి కోరారు. ఈ పర్యటనలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య ని కూడా కలవడం , పలు అంశాలను చర్చించడం జరిగిందని బృందం అభిప్రాయపడింది. ఈ సమావేశాలలో లోయ బాలకృష్ణ , అంకిత్ , కార్తీక్ , బృంద తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









