ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- April 11, 2026
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలను తొలగించేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే అక్కడకు చేరుకుంది. మరోవైపు, ఇరాన్ తన పక్షాన 71 మంది సభ్యులతో కూడిన భారీ ప్రతినిధుల బృందాన్ని పంపింది. ఈ బృందానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ నాయకత్వం వహిస్తుండగా, విదేశాంగ మంత్రి మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ వంటి కీలక వ్యక్తులు ఇందులో ఉన్నారు.
చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ తన పట్టును బిగించింది. ప్రధానంగా రెండు డిమాండ్లను అమెరికా ముందు ఉంచింది: లెబనాన్ పై దాడుల నిలిపివేత: ఇజ్రాయెల్ వెంటనే లెబనాన్‌పై దాడులను ఆపాలి. ఆస్తుల విడుదల: అంతర్జాతీయంగా స్తంభింపజేసిన ఇరాన్ ఆర్థిక ఆస్తులను తక్షణమే విడుదల చేయాలి. ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ చర్చలు విఫలమైతే, మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన ఆయుధాలతో దాడి చేస్తామని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ కూడా తక్కువ తినలేదు. చైనా నుంచి భారీగా అత్యాధునిక ఆయుధాలు ఇరాన్‌కు అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇరాన్ సైనిక బలాన్ని పెంచడమే కాకుండా, చర్చల సమయంలో వారి బేరసారాల శక్తిని కూడా పెంచింది. తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత జరుగుతున్న ఈ చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుంది. లేని పక్షంలో, చైనా అండతో ఇరాన్, ట్రంప్ దూకుడుతో అమెరికా తలపడితే అది మరో భారీ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









