BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!

- April 11, 2026 , by Maagulf
BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!

మనామా: బహ్రెయిన్ 50,000 హౌజింగ్ యూనిట్లు మరియు సేవలను అందించే లక్ష్యంతో BD 800 మిలియన్లతో సామాజిక గృహ నిర్మాణ ప్రణాళికను ప్రారంభించింది. ఎంపీ అబ్దుల్వాహిద్ ఖరాతా ప్రశ్నకు సమాధానంగా..గృహ మరియు పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు వెల్లడించింది.  2025 లో ఎస్కాన్ బ్యాంక్‌తో కలిసి రూపొందించిన కార్యనిర్వాహక ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంది.

డిసెంబర్ 2025 నాటికి 7,000 గృహ సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని, పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రధాన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో మదీనత్ ఖలీఫా ఒకటని, ఇది 3,000కు పైగా యూనిట్లను అందిస్తుందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com