వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- April 11, 2026
హైదరాబాద్: హైదరాబాద్ లో వాటర్ బోర్డు బిల్లుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని భయపెట్టి వినియోగదారులను దోచుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నేరగాళ్లు బాధితులకు మెసేజ్ పంపి HMWSSB WATER BILL UPDATE.apk పేరుతో ఉన్న ఒక లింక్‌ను ఇన్స్టాల్ చేయమని కోరుతున్నారని సీపీ పేర్కొన్నారు. ఈ ఏపీకే ఫైల్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేసిన వెంటనే, ఫోన్ నియంత్రణ పూర్తిగా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించారు. దీనివల్ల బాధితుల బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటీపీలు నేరగాళ్లకు తెలిసిపోయి డబ్బులు మాయమవుతున్నాయని తెలిపారు.
ప్రజలు ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా జాగ్రత్త వహించాలని సీపీ సజ్జనార్ కోరారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైళ్లను, సాఫ్ట్వేర్ లింక్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. వాటర్ బిల్లు చెల్లింపుల కోసం అధికారిక వెబ్సైట్ లేదా యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









