ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- April 11, 2026
ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్స్ (ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విమానయాన రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ప్రాథమికంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 17 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విమానాశ్రయాల్లో ప్యాసింజర్ సర్వీస్ విభాగంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
అర్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం వంటి మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://www.aiasl.in ను సందర్శించవచ్చు. నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







