ట్రంప్ కంటే హిల్లరీ 15 శాతం అధికంగా ఓట్లు...
- August 04, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ఆమె ముందున్నట్టు తాజా సర్వే వెల్లడించింది. ట్రంప్ కంటే హిల్లరీ 15 శాతం అధికంగా ఓట్లు సాధించే అవకాశముందని మెక్ క్లత్చీ-మారిస్ట్ నిర్వహించిన జాతీయ సర్వేలో స్పష్టమైంది. హిల్లరీకి 48 శాతం, ట్రంప్ కు 33 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని వెల్లడించింది.న్యూయార్క్ కు చెందిన మారిస్ట్ ఇన్స్ స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ గత నెలలో నిర్వహించిన సర్వేలో హిల్లరీ-ట్రంప్ 42-39 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. ట్రప్ కంటే హిల్లరీ 9 శాతం ఓట్లు అధికంగా పొందుతారని వాల్ స్ట్రీట్ జర్నల్/ఎన్బీసీ న్యూస్ సర్వే వెల్లడించింది. హిల్లరీయే ముందంజలో ఉన్నట్టు పలు సర్వేలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు వెల్లడైన జాతీయ సర్వేలను బట్టి చూస్తే ట్రంప్ కంటే హిల్లరీ 6.8 శాతం పాయింట్ల సగటుతో ఆధిక్యంలో ఉన్నారని రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







