‘CASTE’ మూవీ ఫస్ట్ లుక్

- April 11, 2026 , by Maagulf
‘CASTE’ మూవీ ఫస్ట్ లుక్

ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘CASTE’ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ.. దర్శకుడు జంపన్న నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన లక్ష్మీ కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా మంచి హిట్ సాధించి జంపన్నకు మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్.

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

త్వరలోనే నటీనటులు, ఇతర వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.

దర్శకత్వం: ఎకె జంపన్న
నిర్మాత: తోట లక్ష్మీ కోటేశ్వర రావు
బ్యానర్: గోల్డెన్ ప్రొడక్షన్స్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
పీఆర్వో: వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com