కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- April 11, 2026
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ప్లయాస్ ట్యాంకర్ లారీ బోల్తా పడడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన ఏపీ, తెలంగాణ హైకోర్టుల సీనియర్ లాయర్ బొద్దులూరి శ్రీనివాసరావుగా గుర్తించారు. ఆయన హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ మారుతీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు టోల్ చెల్లించేందుకు కీసర టోల్ ప్లాజా వద్ద ఆగింది. అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వేగంగా వచ్చి అక్కడ నిలిపి ఉన్న కారుపై బోల్తా పడింది.
16 చక్రాల భారీ ట్యాంకర్ కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. టోల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన కారు బీఎండబ్ల్యూ (TS 6662). మొదట కారులో ముగ్గురు ఉన్నారని ప్రచారం జరిగినా, తరువాత అందులో శ్రీనివాసరావు ఒక్కరే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







