సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!

- April 12, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!

రియాద్ః సౌదీ భద్రతా అధికారులు ఒక వారంలో మొత్తం 15,458 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 8 మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ సంస్థలతో కలిసి భద్రతా దళాలు సంయుక్త తనిఖీలు నిర్వహించాయి.ఈ సందర్భంగా వారిని అరెస్టు చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇక అరెస్టు అయిన వారిలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు 8,440 మంది, సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు 4,054 మంది మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు 2,964 మంది ఉన్నారు. మొత్తం 7,392 మంది అక్రమ నివాసితులను దేశం నుండి బహిష్కరించగా, 22,942 మంది ఉల్లంఘనదారులను ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు పంపినట్లు తెలిపింది.  

అలాగే, సరిహద్దు దాటి సౌదీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ  1,600 మంది అరెస్టయ్యారు. వీరిలో 39 శాతం మంది యెమెన్ జాతీయులు, 60 శాతం మంది ఇథియోపియా జాతీయులు మరియు ఒక శాతం మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. సౌదీని అక్రమంగా విడిచి వెళుతూ 47 మంది అరెస్టు అయ్యారు.

అక్రమ నివాసితులకు రవాణా, ఆశ్రయం మరియు ఉపాధి కల్పించడంలో సహకరించిన సుమారు 30 మంది వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం, మొత్తం 40,184 మంది విదేశీయులు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

అక్రమ నివాసితుల సమాచారం తెలిస్తే.. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబరుకు, మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేసి వేదించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com