సాఫ్ట్ వేర్ లో ప్రావీణ్యుల..అయితే ఇది చదవండి
- August 05, 2016
టెక్ దిగ్గజం యాపిల్ సాప్ట్ వేర్ అప్లికేషన్లలోకి తలదూర్చుతున్నారా...? లోపాలు వెతికే పనిలో పడ్డారా..? అయితే యాపిల్ సాప్ట్ వేర్ లో లోపాలను గుర్తించే వారికి ఇది బంపర్ ఆఫరే. లోపాలను గుర్తించి రివార్డులను కొట్టేయొచ్చట. తన కంపెనీ సాప్ట్ వేర్ లో భద్రతాపరమైన లోపాలను గుర్తించి, తెలియజేసినందుకు హ్యాకర్లకు 2లక్షల డాలర్ల(కోటి 33 లక్షలకు పైగా) వరకు రివార్డును ఆఫర్ చేయనున్నట్టు యాపిల్ ఇంక్ ప్రకటించింది. లాస్ వెగాస్ లోని కంప్యూటర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రొగ్రామ్ లో యాపిల్ ఈ విషయాన్ని వెల్లడించింది.ప్రారంభంలో లిమిటెడ్ రీసెర్చర్లకు ఈ రివార్డులను అందిస్తామని, ఈ ప్రొగ్రామ్ ను మెల్లమెల్లగా విస్తరిస్తామని గూగుల్ తెలిపింది. కంపెనీ సాప్ట్ వేర్ లో భద్రతను సీరియస్ గా తీసుకున్న యాపిల్, సమస్యను గుర్తించడంలో బయటి వ్యక్తుల సహకారాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ సమాచారాన్ని ఇతరులకు విక్రయించకుండా డైరెక్టుగా కంపెనీకే అందించేలా హ్యాకర్లకు రివార్డులను అందించాలని యాపిల్ నిర్ణయించింది.
తమ కంప్యూటర్ కోడ్ ల్లో లోపాలు గుర్తించిన వారిని టెక్ దిగ్గజాలు "బగ్ బౌన్ టీస్"గా పిలుస్తారు. గూగుల్, ఫేస్ బుక్ వంటి ఇతర కంపెనీలు తమ సాప్ట్ వేర్ లో లోపాలను గుర్తించి, కంపెనీకి తెలియజేసినందుకు హ్యాకర్లకు ఎప్పటినుంచో రివార్డులను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం యాపిల్ సైతం ఈ బాటలోనే పయనించనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







